డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించింది. అయితే సారా అధికారులకు సంచలన నిజాలు చెప్పినట్టు సమాచారం. తాను సుశాంత్‌తో కొంతకాలం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని.. తాము ఇద్దరం కలిసి థాయిలాండ్ కూడా వెళ్లామని ఆమె చెప్పారట.
‘సుశాంత్ డ్రగ్స్ తీసుకొనేవాడు. నేను సిగరెట్లు తాగేదాన్ని కానీ డ్రగ్స్ మాత్రం అలవాటు లేదు’ అని ఆమె తన వాంగూల్మంలో చెప్పారట. అయితే ఈ కేసులో ఇప్పటికే సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్సీబీ ప్రశ్నించింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డట్టు సమాచారం.