సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 60, జగిత్యాల 45, జనగామ 35, జయశంకర్ భూపాలపల్లి 22, కామారెడ్డి 49, కరీంనగర్ 127, ఖమ్మం 77, మహబూబ్నగర్ 24, మహబూబాబాద్ 84, మంచిర్యాల 33, మేడ్చల్ మల్కాజిగిరి 121, నాగర్కర్నూల్ 27, నల్లగొండ 141, నిర్మల్ 29, నిజామాబాద్ 84, పెద్దపల్లి 47, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 176, సంగారెడ్డి 64, సిద్దిపేట 132, సూర్యాపేట 66, వికారాబాద్ 22, వనపర్తి 23, వరంగల్ రూరల్ 39, వరంగల్ అర్బన్ 98, యాదాద్రి భువనగిరి 46 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.