జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్‌కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్‌షాక్‌తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్‌కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. గాయపడ్డవారికి జనసేన పార్టీ తరఫున చికిత్స అందజేస్తామని చెప్పారు.
- September 2, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- ANDHRAPREADESH
- BIRTHDAY
- DEATH
- HYDERABAD
- JANASENA
- KUPPAM
- PAWANKALYAN
- అభిమానులు
- పవన్‌కల్యాణ్
- మృతి
- విద్యుత్‌షాక్
- Comments Off on వాళ్ల మృతి బాధించింది