బాలీవుడ్ డ్రగ్స్‌కేసు రోజుకో కీలకమలుపు తిరుగుతున్నది. ఈ క్రమంలో ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. రకుల్‌తో పాటు మహేశ్‌బాబు సతీమణి నమ్రత పేరు కూడా డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని రకుల్ చెప్పినప్పటికీ ఎన్సీబీ మాత్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రకుల్ ఎన్సీబీ ఎదుట హాజరైంది. అయితే రియా చక్రవర్తితో స్నేహం చేయడమే రకుల్ కొంపముంచినట్టు సమాచారం. ప్రస్తుతం రియా, రకుల్ మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలు.. వారు డ్రగ్స్ విషయంపై మాట్లాడుకున్న మాటలు కీలకంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌తో పాటు శ్రద్ధా కపూర్ పేర్లు కూడా వినిపించాయి. అయితే రియా చక్రవర్తి చెప్పిన లిస్ట్ చాలా పెద్దదని మొత్తం 78 మందికి పైగా ఈ కేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఇంతవరకు ఏ హీరో పేరు కూడా డ్రగ్స్‌కేసులో బయటకు రాలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.