సారథిన్యూస్, వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్‌కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేయడం ప్రస్తుతం వికారాబాద్‌లో కలకలం రేపుతున్నది. వికారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అక్కతోపాటు , చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే.. ఆ యువతిని దుండగులు ఓ వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు.
అయితే కిడ్నాప్‌కు గురైన యువతికి రెండేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి అయినట్టు సమాచారం. అయితే ఆమె ప్రస్తుతం భర్తకు దూరంగా తల్లిదండ్రులతో ఉంటున్నది. ఈ క్రమంలో భర్తే ఆమెను తీసుకెళ్లాడని సమాచారం. ఈ క్రమంలో కొందరు యువకులు కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కూతురుని భర్త తరఫు వాళ్లు కిడ్నాప్ చేశారా? లేక వేరే వ్యక్తులు ఎవర్నా కిడ్నాప్ చేశారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.