విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లోకి వచ్చారు. అనంతరం వారు ‘మోహన్‌బాబు నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని వదిలిపెట్టం’ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తేరుకునేలోపే వారు అక్కడినుంచి పారిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి మంచు కుటుంబం షాక్‌గు గురైంది. అనంతరం మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారులో కొందరు దుండగులు మోహన్‌బాబు ఇంట్లోకి వచ్చినట్టు సమాచారం. ఈ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది ఆకతాయిల పని.. లేదా ఏదన్న కుట్ర దాగి ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.
- August 2, 2020
- Archive
- Top News
- సినిమా
- HYDERABAD
- MANCHU
- MOHANBABU
- SATURDAY
- WARNING
- మోహన్‌బాబు
- వార్నింగ్
- Comments Off on మోహన్‌బాబుకు వార్నింగ్