సారథి న్యూస్, వరంగల్: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ తిరిగారు. మంత్రి వెంట ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, హరిత, నగరపాలక సంస్థ కమిషనర్పమేలాసత్పతి, స్థానిక కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.
- August 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- DAYAKARRAO
- ERRABELLI
- HEAVY RAIN
- WARANGAL
- ఎర్రబెల్లి
- దయాకర్‌రావు
- భారీవర్షం
- వరంగల్
- Comments Off on ముంపు బాధితులకు అండగా ఉంటాం