సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ రాష్ట్ర బంద్ పాటించాలని, హిందూ ఫాసిస్టులైన మోడీ, అమిత్ షా వారితో జత కలిసిన కేసిఆర్ కుట్రలను బహిర్గతం చేద్దాం.. రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని, 60 ఏళ్లు పైబడిన సాధారణ ఖైదీలను విడుదల చేయాలని, ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకు వ్యతిరేకంగా పోరాడుదాం’ అని తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ (మావోయిస్టు) పేరుతో వెలసిన కరపత్రాల్లో పేర్కొన్నారు.
- July 23, 2020
- Archive
- తెలంగాణ
- వరంగల్
- MAOIST
- MULUGU
- SAIBABA
- TELANGANA
- VARAVARARAO
- మావోయిస్టు
- ములుగు
- వరవరరావు
- Comments Off on మావోయిస్టు కరపత్రాల కలకలం