న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పాల్గొన్న రాహుల్.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు పంపించారు. అసమ్మతి నేతలంతా బీజేపీతో, కాంగ్రెస్ వ్యతిరేక మీడియాతో చేతులు కలిపారా. మీరు పార్టీని బాగుచేయడానికి ఉన్నారా.. లేక పార్టీ పరువుతీయడానికా’ అంటూ రాహుల్ సొంతపార్టీ నేతలపై మండిపడ్డారట. రాహుల్ గాంధీతోపాటు మన్మోహన్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కూడా ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టినట్టు సమాచారం.
- August 24, 2020
- Archive
- Top News
- జాతీయం
- పొలిటికల్
- CONGRESS
- DELHI
- MEDIA
- MEETING
- RAHULGANDHI
- కాంగ్రెస్‌నేతలు
- ఫైర్
- రాహుల్‌గాంధీ
- Comments Off on బహిరంగ ‘లేఖ’పై రాహుల్ ఫైర్