సారథిన్యూస్, హైదరాబాద్: ‘సారూ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసీఆర్ సార్ పిలుపునిచ్చినప్పుడల్లా బంద్‌లో పాల్లొన్న.. ఉద్యమాలు చేసిన.. లాఠీదెబ్బలు తిన్న.. పోలీస్‌స్టేషన్‌కు పోయివచ్చిన.. కేసులు గూడ అయినయి.. చివరకు తెలంగాణ వచ్చింది. మా దేవుడు కేసీఆర్ సీఎం అయ్యిండి.. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలే’ అంటూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్ ఎదుట ఆందోళనకు దిగాడు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పేరు చందర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న. కేసీఆర్సారు దయచేసి నాకు డబుల్బెడ్రూం ఇప్పించాలే’ అంటూ వేడుకున్నాడు. 2010లోనూ చందర్ ఓసారి అసెంబ్లీ ఎదుట చందర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు సమాచారం.
- September 18, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- AUTODRIVER
- HYDERABAD
- KCR
- KTR
- PRAGATHIBHAVAN
- SUSCIDE
- TELANGANA
- ఆటోడ్రైవర్
- ఆత్మహత్యాయత్నం
- ప్రగతిభవన్
- Comments Off on ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం