Breaking News

నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​!

హీరో నితిన్​ పెళ్లి డేట్ ఖరారయినట్టు సమాచారం. ఏప్రిల్​ 16న నితిని పెళ్లి జరుగాల్సి ఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. నాగర్​కర్నూల్​కు చెందిన వైద్యురాలు నూర్జహాన్​ కుమార్తె కందూకూరి శాలినితో నితిన్​ వివాహం నిశ్చయమైన సంగతి తెలిందే. శాలినీ లండన్​లో విద్యనభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డిసెంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్ద‌లు జూలై 26న నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌ని టాక్​. హైద‌రాబాద్ సమీపంలోని ఓ ఫామ్​హౌస్​లో నిరాడంభరంగా వీరి పెళ్లి జరుగునున్నట్టు సమాచారం.