సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్భూపాలపల్లి 20, జోగుళాంబ గద్వాల 28, కరీంనగర్97, ఖమ్మం 26, మహబూబ్‌నగర్41, మహబూబాబాద్39, మంచిర్యాల 18, నల్లగొండ 61, నిజామాబాద్44, పెద్దపల్లి 21, సిరిసిల్ల 30, సంగారెడ్డి 33, సిద్దిపేట 24, సూర్యాపేట 37, వనపర్తి 23, వరంగల్అర్బన్102, భువనగిరి 16 చొప్పున పాజిటివ్కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులిటెన్‌ను విడుదల చేసింది.