సారథిన్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాస్, నీలరపు రవి తదితరులు పాల్గొన్నారు.
- August 28, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHANDER
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- MLA
- PEDDAPALLY
- TRS
- కేసీఆర్
- టీఆర్ఎస్
- Comments Off on ‘డబుల్’ ఇండ్లు గొప్పపథకం