Breaking News

టీవీ నటుడిపై దాడి

టీవీ నడుడిపై దాడి

ఢిల్లీ: టీవీ నటుడు అన్ష్​ బాగ్రీపై ఓ రౌడీ గ్యాంగ్​ దాడి చేసింది. అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. ఓ కాంట్రాక్టర్​తో గొడవే దాడికి కారణమని తెలుస్తున్నది. అన్ష్​ ఇటీవల ఢిల్లీలో తన ఇంటిని నిర్మించే ఇచ్చే పనిని ఓ కాంట్రాక్టర్​కు అప్పగించాడు. సదరు కాంట్రాక్టర్​ ఇంటిని అసంపూర్తిగా వదిలేశాడు. ఈ క్రమంలో అన్ష్​ ఆ కాంట్రాక్టర్​తో గొడవకు దిగాడు. దీంతో కోపం పెంచుకున్న కాంట్రాక్టర్​ అన్ష్​ ఇంటికి 10 మంది రౌడీలను పంపించి అతడిపై దాడి చేయించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.