సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసపాలన కొనసాగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారందని ఈ రాక్షస ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇంతకంటే ఈ రాష్ట్రంలో దారుణమైన విషయం ఏముంటది అనిపేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు గిరిజన అధికారి సోమ్లూ నాయక్‌ను దౌర్జన్యంగా అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సోమ్లూ నాయక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ప్రభుత్వం భవిష్యత్‌తో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.
- September 10, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- పొలిటికల్
- CHANDRABABU
- CM JAGAN
- FIRE
- LOKESH
- TDP
- YCP
- ఆంధ్రప్రదేశ్
- వైసీపీ
- సీఎం జగన్
- Comments Off on ఏపీలో రాక్షసపాలన.. లోకేశ్ ఫైర్