సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, ట్యూబ్ వెల్ కలిగి ఉండకూడదు. లబ్ధిదారులకు కనిష్టంగా 2.5 ఎకరాల విస్తీర్ణం తప్పనిసరిగా ఒకే వరుసలో ఉండాలి. 2.5 ఎకరాలు వరుస క్రమంలో లేకపోతే కనిష్టంగా 2.5 ఎకరాల నుంచి గరిష్టంగా ఐదెకరాల వరకు రైతుల సమూహం వరుస క్రమంలో ఉన్నా సరిపోతుందని ‘వైఎస్సార్ జలకళ’ పథకం నిబంధనల్లో ప్రభుత్వం సూచించింది.
28న ప్రారంభం
ఈనెల 28న స్థానిక ఎస్టీ, బీసీ కాలేజీ మైదానంలో ఉదయం 10 గంటలకు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. 14 నియోజకవర్గాల బోర్ వెల్స్ వాహనాలు కాలేజీ గ్రౌండ్ నుంచి ఓల్డ్ పోలీస్ కంట్రోల్ రూం, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా సీ క్యాంప్ నంద్యాల చెక్ పోస్ట్ మీదుగా కాన్వాయ్ గా బయలుదేరి వెళ్తాయని చెప్పారు. ఆసక్తిగల రైతుల నుంచి గ్రామసచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
- September 26, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDRAPRADESH
- CM YS JAGAN
- Kurnool
- YSRJALAKALA
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- వైఎస్సార్ జలకళ
- సీఎం జగన్
- Comments Off on ఏపీ రైతులకు వరం