Breaking News

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేబినెట్​లో చర్చించి దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం కేసీఆర్ ​ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​విధించడమే పరిష్కారమని అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో హైదరాబాద్​లో ఉద్యోగాలు, ఉపాధి కోసం నివాసం ఉంటున్న వాళ్లు సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఎలాగూ పోటీ పరీక్షలైన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్, ఎడ్ సెట్ కూడా వాయిదాపడడంతో సొంత ప్రాంతానికే వెళ్తే బెటరని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవాళ్లు పయనమవుతున్నారు. రెండు మూడు రోజులుగా బస్సులు, రోడ్లపై కూడా రద్దీ కూడా బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్​–బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. అటు ఎల్బీనగర్, ఇటు అరాంఘర్​చౌరస్తా వద్ద బస్సులు, ఇతర వాహనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండడంతో తెలంగాణ, ఏపీ సరిహద్దు వద్ద అధికారులు వాహనాలను నిలిపివేస్తుండడంతో వాహనదారుల్లో టెన్షన్ ​నెలకొంది.