- లేదంటే పార్టీ పదవీ నుంచి తప్పుకుంటా..
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సామాజికసారథి, సంగారెడ్డి: పూర్వ మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థికి 230 ఓట్లు వస్తాయని, రాకపోయినా, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ పదవీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు. వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు లాభం లేదన్నారు. రైతులకు వరి సాగు మానేయాలని చెప్పడం సరికాదన్నారు. యాసంగి తర్వాత.. ముందు పండిన పంటను కొనాలని ఆయన సూచించారు. బీజేపీ`టీఆర్‌ఎస్ కొట్లాట రాజకీయం కోసమేనని, రైతుల కోసం కాదన్నారు.