- మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక
విజయవాడ: ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శివర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 13 మందిని ఎంపికచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చిన మాజీ ఎంపీ, సీనియర్ నేత పి.మధుతో పాటు మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య సహా ఐదుగురు నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వి.శ్రీనివాసరావు.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందిస్తున్నారు.