సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, వార్డు అధ్యక్షుడు సతీష్, మాజీ సర్పంచి ఏర్రగొని నరసింహా, కొయ్యలగూడెం వెంకటేష్, రఘుపతి, శివ, తదితరులు పాల్గొన్నారు.