Breaking News

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

సారథి, అయిజ(మానవపాడు): అయిజ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ నిర్వహించే వ్యాపారులు అధికార బలంతో చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల తై బజార్ లో రేట్లను అడ్డగోలుగా పెంచి తమ పొట్టగొడుతున్నారని రైతులు చిరు వ్యాపారులతో కలిసి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. గంప కూరగాయలు తీసుకొస్తే రూ.30 వస్తే.. అందులో దళారులు, తైబజార్ నిర్వాహకులకు రూ.25 పోతే వచ్చే రూ.ఐదుతో కనీసం రవాణా చార్జీలు కూడా వెళ్లక నానాఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

చిరు వ్యాపారస్తులతో కలిసి రోడ్డుపై బైఠాయించి దళారుల కమిషన్లు, తై బజార్ అధిక రేట్లను తగ్గించి న్యాయం చేయాలని రాస్తారోకో చేశారు.కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వారికి మద్దతు తెలిపారు. మధ్య దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతులు స్వచ్ఛందంగా అమ్ముకోవడానికి రైతు బజార్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్​ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారితో పాటు కౌన్సిలర్ గిత్తల దేవరాజు, సీనియర్ నాయకులు ఉప్పల తిప్పన, బసవరాజు, సాంబశివుడు, శాలి, ఫిరోజ్ పాల్గొన్నారు.