సారథి, చొప్పదండి: చొప్పదండి జడ్పీ హైస్కూలులో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు సూపర్ స్ప్రెడర్స్ కు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి, కౌన్సిలర్ మహేష్, నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులు […]