Breaking News

సీతారామరాజు

ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

సారథి, చొప్పదండి: ఏబీవీపీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడెల్లి లక్మిపతి మాట్లాడుతూ.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించి, బానిసత్వపు సంకెళ్లు తెంచి, మాతృదేశ విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్తిక్, సంకేర్త్, అక్షయ్, చందు, వేణు, రాజు, ఉప్పి, అజయ్, ప్రమోద్ పాల్గొన్నారు.

Read More