సారథి న్యూస్, ఖమ్మం: కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనం. 203 అమలైతే.. దక్షిణ తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందక ఎడారిగా మారడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా గోళ్లపాడులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా […]