సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్నగర్లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. […]