సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని […]