హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన హెల్త్ కండీషన్ ఉన్నట్టుండి క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబసభ్యులు ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతి ఇచ్చారు. వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల […]