సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. డ్రైవర్ అనిల్, ఓనర్ తిరుపతిని అదుపులోకి తీసుకుని వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.