సారథి, మానవపాడు: యునైటెడ్ వే ఆఫ్ ఇండియా బొంబాయి సంస్థ వారు రాజోలి చేనేత శ్రామిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో రాజోలి గ్రామంలో వెయ్యి చేనేత కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా ఉండటంతో చేనేత మగ్గాలు నడవక చాలా కుటుంబాలకు తినడానికి కూడా తిండిలేక పస్తులు ఉంటున్నాయి. అలాంటి వారికి తమవంతుగా సాయం చేస్తున్నారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కో ఆప్షన్ సభ్యుడు నిషాక్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]