సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ద్వారక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ హాజరై పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో వరుసగా పద్మగల్ల లక్ష్మి, కుమ్మరి నవ్య, నిమ్మగల్ల సరిత, నిమ్మగల్ల విజయ మొదటి, రెండవ, మూడవ, నాలుగవ బహుమతులను గెలుచుకున్నారు. మహిళలను చైతన్యపరిచేందుకు పోటీలు నిర్వహించామని గ్రామ సర్పంచ్ నీరజ పవన్ […]