న్యూఢిల్లీ: బంతి రంగు మెరుగుపర్చేందుకు పాత కాలంలో వాడినట్లుగా.. కాటన్ టవల్‌తో రుద్దితే సరిపోతుందని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ (డ్యూక్స్) వెల్లడించింది. క్రికెట్ ఆరంభంలో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఇదే సూత్రాన్ని పాటించారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జజోడియా తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మి వాడకపోవడం మంచిదేనని, అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘టెస్ట్ మ్యాచ్‌ల్లో బంతి పాతబడే కొద్ది మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఉమ్మి, చెమట ఏదైనా […]