న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్‌కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. […]