బీజింగ్: అతి ఎప్పటికీ అనర్థదాయకమేనన్న లోకోక్తికి ఈ ఘటన అద్దం పడుతున్నది. చైనాలోని జేజియాంగ్ ప్రావిన్సుకు చెందిన హు అనే వ్యక్తి ఇటీవల ఒకే సారి 10 బీర్లు తాగాడు. అతర్వాత 18 గంటల పాటు మూసిన కన్నులు తెరవకుండా నిద్రించాడు. అంతే.. లేచేసరికి భయంకరమైన కడుపునొప్పితో తీవ్రంగా ఆయాసపడుతుండగా స్నేహితులు గమనించి దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షలు చేయగా.. 18 గంటల పాటు మూత్రవిసర్జన చేయకుండా అలాగే నిద్రపోవడంతో మూత్రాశయం గోడలకు చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. […]