న్యూఢిల్లీ: చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొవడంతో.. తన కెరీర్ ఆలస్యంగా మొదలైందని టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డానన్నాడు. స్పైక్ షూస్ లేవనే కారణంతో ఓ కోచ్ మ్యాచ్ ఆడనివ్వలేదని గుర్తుచేసుకున్నాడు. ‘నా కెరీర్ చాలా ఆలస్యంగా మొదలైంది. కార్క్ బాల్‌తో క్రికెట్ ఆడతారని టీవీల్లో మాత్రమే చూశా. దానిని పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. బయట క్రికెట్ లో నేను యార్కర్లు అద్భుతంగా వేస్తుండడాన్ని ఒకాయన గమనించాడు. […]