కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా బారినపడ్డాడు. ఒంట్లో నలతగా ఉండడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లిన అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్‌గా రావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి తనలో తీవ్రమైన లక్షణాలు లేని కారణంగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వెల్లడించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నాడు. పాకిస్థాన్ తరఫున 44 టెస్ట్‌ల్లో 2,963 పరుగులు చేసిన 38 ఏళ్ల ఉమర్.. 12 వన్డేల్లో 504 పరుగులు సాధించాడు. […]