ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి, అధికారులు చెప్పాలె మన పంట హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలె: సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వరిలో ఏయే రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయొద్దు.. బదులుగా కందులు వేయాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వేయకపోతే వారికి రైతుబంధు రాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతితో వ్యవసాయం చేయాలన్నారు. […]