సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో […]