లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]