క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్‌కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. […]