సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మండలంలోని జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి రూ.60వేలు, టెంకటి గ్రామానికి చెందిన సావిత్రికి రూ.35వేల చెక్కును ఆయన అందజేశారు. ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల […]