న్యూఢిల్లీ: కరోనాకు మందు కనిపెట్టామని ఈ మాత్రలు వేసుకుంటే కరోనా పూర్తిగా నయమవుతుందని పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తిచేశామని, 90శాతం రిజల్ట్స్ ఉంటాయని కూడా ప్రచారం చేసింది. కాగా, ఈ విషయంపై పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా మందుపై ట్రయల్స్ కు అనుమతిచ్చిన ఆస్పత్రికి కూడా నోటీసులు పంపింది. దాంతో పతంజలి సంస్థ మాట మారుస్తూ యూ టర్న్ తీసుకుంది. తాము కరోనాకు అసలు […]