సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్బంద్కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో […]