సారథి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండా జయలతాదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులు ఉన్నారు.