Breaking News

కారుణ్య

సింగర్​ కారుణ్య తల్లి కన్నుమూత

ప్రముఖ సింగర్​ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్​ ఐడల్​ రన్నరప్​గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్​తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్​ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్​చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.

Read More