సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]