సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ ఎంపీపీ కార్యాలయంలో సమీక్షించారు. గ్రామాల్లో నర్సరీ పనులు నిర్వహణ, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం పనుల్లో పురోగతి..ఉపాధి హామీ పనులకు కూలీల సమీకరణ పెంపు తదితర విషయాలను చర్చించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.