సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 […]