సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక […]