సారథి, అలంపూర్(మానవపాడు): ఎలాంటి ఆదాయవనరు లేకపోయినా, చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులను ఇటీవల కొందరు పెత్తందారులు వేధింపులకు పాల్పడుతున్నారని అర్చకసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకులకు వచ్చే వేతనాల్లో తమకు వాటా ఇవ్వాలని వేధింపులకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.ఆరువేల వేతనంలో రూ.రెండువేలు పూజాసామాగ్రికే సరిపోతుందని, […]
సారథి న్యూస్, అలంపూర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చక స్వాములు అంతా ఐకమత్యానికి మారుపేరుగా నిలవాలని అర్చక సంఘం ఉపాధ్యక్షుడు, అర్చక సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తిరునగరి నరేంద్రాచార్యులు అన్నారు. సోమవారం అలంపూర్చౌరస్తాలోని మార్కెట్ యార్డులో సంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ డీడీఎన్ఎస్త్రీమెన్కమిటీ బాధ్యుడు దిండిగల్ఆనంద్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రాచార్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ఆలయాల అర్చకులు వారి ప్రాంతంలో […]