న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌పై కులం పేరుతో కామెంట్లు చేసిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ శుక్రవారం క్షమాపణ కోరాడు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువీ.. చహల్ గురించి మాట్లాడుతూ అతని కులప్రస్తావన తెచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. హర్యానాకు చెందిన ఓ అడ్వకేట్ యువీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, యువీ ట్విట్టర్ […]